News December 20, 2024
మహేశ్‌బాబు ‘ముఫాసా’ విడుదల
‘లయన్ కింగ్’కు ప్రీక్వెల్‌గా వస్తోన్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ థియేటర్లలో రిలీజైంది. ముఫాసాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ అందించడంతో థియేటర్ల వద్ద ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. స్క్రీన్‌పై బాబు కనిపించకపోయినా సింహంలో ఆయన్ను చూసుకుంటూ వాయిస్ ఎంజాయ్ చేస్తున్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ అందించిన డబ్బింగ్ నవ్వు తెప్పించిందని అంటున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ!
Similar News
News December 20, 2024
తాజ్‌మహల్‌కు తగ్గి, అయోధ్య రామాలయానికి పెరిగిన రద్దీ!
ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు యూపీ పర్యాటకశాఖ తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు పర్యాటకులకు వచ్చేవారని, ఈ స్థానంలో అయోధ్య రామాలయం చేరిందని పేర్కొంది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యకు 13.55 కోట్ల మంది వస్తే, తాజ్‌మహల్ చూసేందుకు 12.51 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు.
News December 20, 2024
ఫిజిక్స్ వాలా కంపెనీతో ఒప్పందం: లోకేశ్
APలో డీప్-టెక్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన భాగస్వామి అమెజాన్ వెబ్‌తో కలిసి AI-ఫోకస్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్తో మరో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.
News December 20, 2024
పాక్‌తో మెరుగైన బంధానికి ఓకే చెప్పా: యూనస్
పాకిస్థాన్‌తో సంబంధాల బలోపేతానికి అంగీకరించినట్టు బంగ్లా ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. ఈజిప్ట్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్ సందర్భంగా పాక్ PM షెహబాజ్ షరీఫ్‌ను యూనస్ కలిశారు. 1971 యుద్ధ తరువాత ఇస్లామాబాద్‌తో అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించుకోవాలని యూనస్ కోరుకున్నారు. ద్వైపాక్షిక బంధాల మెరుగుకు ఇరు దేశాలు సంయుక్తంగా కట్టుబడి ఉన్నాయని షరీఫ్ కూడా పేర్కొన్నారు.