News July 13, 2024

ఒకే ఫ్రేమ్‌లో మహేశ్& ధోనీ❤️

image

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అనంత్-రాధిక వివాహ వేడుక ఈ ఐకానిక్ ఫొటోకు వేదికైంది. ఒకరు సినీ ఇండస్ట్రీలో, మరొకరు క్రికెట్‌లో సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సింగ్‌‌లో అదిరిపోయారంటున్నారు. మ్యూచువల్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఎనలేని సంతోషాన్నిస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 20, 2025

భారీగా IPSల బదిలీ

image

APలో 27 మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
*పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనా
*కర్నూల్ ఎస్పీగా విక్రాంత్ పాటిల్
*కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్
*ఎర్రచందనం యాంటీ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా సుబ్బరాయుడు
*తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
*ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా పాలరాజు
*IGP ఆపరేషన్స్‌గా సీహెచ్ శ్రీకాంత్

News January 20, 2025

జియో కస్టమర్లకు షాక్.. ఏకంగా రూ.100 పెంపు

image

రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రూ.199 ప్లాన్‌ను ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299 అని జియో పేర్కొంది. పెంచిన ధరలు JAN 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్‌గా రూ.299 ప్లాన్‌కు బదిలీ అవుతారు. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, నెలకు 25GB డేటా వస్తాయి. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ.299కి బదులు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

News January 20, 2025

రెండు రాష్ట్రాలు.. ఒకే ఆత్మ: సీఎం చంద్రబాబు

image

దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఫొటోను తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ వెయిటింగ్ లాంజ్‌లో అనూహ్యంగా సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు గురించి చర్చించాం’ అని రేవంత్ రాసుకొచ్చారు. దీనికి సీఎం CBN స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాలు.. ఒకే ఆత్మ. తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలి. TG సీఎం రేవంత్ గారిని కలవడం ఆనందంగా ఉంది’ అని రిప్లై ఇచ్చారు.