News July 13, 2024
ఒకే ఫ్రేమ్‌లో మహేశ్& ధోనీ❤️

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అనంత్-రాధిక వివాహ వేడుక ఈ ఐకానిక్ ఫొటోకు వేదికైంది. ఒకరు సినీ ఇండస్ట్రీలో, మరొకరు క్రికెట్‌లో సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సింగ్‌లో అదిరిపోయారంటున్నారు. మ్యూచువల్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఎనలేని సంతోషాన్నిస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News February 13, 2025
2028కల్లా గగన్‌యాన్ మానవసహిత ప్రయోగం

గగన్‌యాన్ మానవసహిత ప్రయోగాన్ని 2028కల్లా చేపట్టనున్నట్లు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘గగన్‌యాన్‌లో మొత్తం 8 మిషన్స్ ఉంటాయి. వాటిలో 6 మానవరహితంగా, 2 మానవ సహితంగా ఉంటాయి. తొలి ప్రయోగాన్ని ఈ ఏడాది చేపడతాం. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లను కేటాయించాం’ అని వివరించారు.
News February 13, 2025
NCA జిమ్‌లో బుమ్రా.. ఫొటో వైరల్

వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా బెంగళూరు NCAలో పునరావాసం పొందుతున్నారు. తాజాగా జిమ్‌లో ఉన్న ఫొటోను ఈ స్టార్ బౌలర్ షేర్ చేస్తూ ‘రీబిల్డింగ్’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫొటో వైరలవుతోంది. త్వరగా కోలుకుని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రావాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ CTకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
News February 13, 2025
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇటీవలే CM బీరెన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మణిపుర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మే 2023 నుంచి ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే CM ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని సొంత పార్టీ MLAలే విమర్శించారు. విశ్వాస పరీక్ష జరిగితే MLAలు విప్‌ను ధిక్కరించే అవకాశం ఉండటంతో బీజేపీ అధిష్ఠానం సూచనతో ఆయన తప్పుకున్నారు.