News September 6, 2024
కాంగ్రెస్‌తో మహేష్ కుమార్‌ది 40 ఏళ్ల అనుబంధం

NSUIలో క్రియాశీలకంగా పనిచేసిన మహేశ్ కుమార్ గౌడ్‌కి కాంగ్రెస్‌తో 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1966 Febలో నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహమత్ నగర్లో ఆయన జన్మించారు. NSUI జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారిగా 1994లో డిచ్పల్లి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2013-14 మధ్య ఏపీ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా చేశారు. 2018, 2023 ఎన్నికల్లో పోటీచేయలేదు. 2024లో MLA కోటాలో MLCగా ఎన్నికయ్యారు.
Similar News
News December 6, 2025
11 నుంచి అటల్-మోదీ సుపరిపాలన యాత్ర

AP: ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా అటల్-మోదీ సుపరిపాలన యాత్ర చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి ఆవిష్కరించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ శతజయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నామన్నారు. దేశ హితం కోసమే ఆయన నిత్యం తపించేవారని, గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారని గుర్తుచేసుకున్నారు.
News December 6, 2025
INDvsSA.. ఇద్దరు ప్లేయర్లు దూరం!

భారత్‌తో మూడో వన్డేకు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ బర్గర్, బ్యాటర్ టోనీ డి జోర్జి గాయాల కారణంగా దూరమయ్యారు. జోర్జి T20 సిరీస్‌కూ దూరమైనట్లు SA బోర్డు వెల్లడించింది. టీ20లకు ఎంపికైన పేసర్ మఫాకా ఇంకా కోలుకోలేదని, అతడి స్థానంలో సిపమ్లాను ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా తొలి వన్డేలో 39 రన్స్ చేసిన జోర్జి, రెండో వన్డేలో 17పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. బర్గర్ 2 మ్యాచుల్లో 3 వికెట్లు తీశారు.
News December 6, 2025
ధనికులకు దండాలు.. పేదలకు దండనా?.. రైల్వే తీరుపై విమర్శలు

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక <<18483830>>రైళ్లను<<>>, 37 రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. ‘సామాన్యుల రద్దీతో జనరల్ బోగీలు నిండిపోయి ఇబ్బంది పడుతున్నా మా కోసం ఎప్పుడైనా అదనపు బోగీలు వేశారా? ధనవంతులకి ఒక న్యాయం, పేదవాడికి మరో న్యాయమా?’ అని మండిపడుతున్నారు. పండుగల సమయాల్లోనైనా బోగీలు పెంచాలంటున్నారు.


