News October 7, 2025
‘SSMB29’లో ప్రియాంకతో మహేశ్ మాస్ డాన్స్?

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘SSMB29’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ ఫోక్ సాంగ్‌లో బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రాతో మహేశ్ స్టెప్పులేస్తారని సినీవర్గాల టాక్. ఈ సాంగ్‌కు కీరవాణి అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వనుండగా రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారని సమాచారం. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీకరించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
Similar News
News October 7, 2025
జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ?

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ఓకే చెబితే నందమూరి హరికృష్ణ కూతురు, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నేడు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ఉండవల్లి నివాసంలో భేటీ కానున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలతో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేయనున్నారు.
News October 7, 2025
ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పే ధైర్యం CECకి లేదు: కాంగ్రెస్

బిహార్‌లో ఎన్ని నాన్ సిటిజెన్స్ ఓట్లను తొలగించారో వెల్లడించే ధైర్యం CECకి లేదని CONG ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘SIRలో పౌరులు కాని వ్యక్తుల పేరిట ఉన్న ఓట్లను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా తొలగించిన ఓట్ల లెక్కల్ని దేశ ప్రజలకు తెలిసేలా బయటపెట్టాలి. ఎన్నికల సంఘం ఆ పని మాత్రం చేయడం లేదు’ అని Xలో విమర్శించారు. కాగా బిహార్ SIRపై తమ అనాలసిస్‌ను జైరామ్ రమేశ్ Xలో పోస్టు చేశారు.
News October 7, 2025
పైడితల్లి అమ్మవారి దివ్యగాథ

విజయనగరానికి రాజైన తన సోదరుడు విజయరామరాజును బొబ్బిలి యుద్ధానికి వెళ్లొద్దని పైడితల్లమ్మ ముందే చెబుతారు. కానీ ఆమె మాట వినక రాజు యుద్ధానికెళ్లి మరణిస్తాడు. ఈ కబురు తెలిసి అమ్మవారు కూడా తనువు చాలిస్తారు. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలోకి వచ్చిన అమ్మవారు తన ప్రతిరూపాలు లభించే స్థలాన్ని సూచిస్తారు. వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని చెబుతారు. ఆ విగ్రహాలు నిజంగానే లభ్యమవ్వగా, ఆలయాన్ని నిర్మించారు.