News October 18, 2024
రెండు భాగాలుగా మహేశ్-రాజమౌళి సినిమా?

సూపర్‌స్టార్ మహేశ్‌తో రాజమౌళి తెరకెక్కించే సినిమా 2 భాగాలుగా రానుందా? నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది. కథ విస్తృతమైనది కావడంతో ఒక భాగంలో మొత్తం చెప్పడం సాధ్యం కాదని, 2 భాగాలుగా తీయాలని రాజమౌళి అండ్ కో భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీటికి లభించే ఆదరణ బట్టి మున్ముందు మరిన్ని సీక్వెల్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉందంటున్నాయి. మూవీ టీమ్ నుంచి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News February 11, 2026
ఆస్పత్రిలో అభిషేక్ శర్మ.. మ్యాచుకు కష్టమే!

డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఢిల్లీలో గౌతమ్ గంభీర్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లిన అభి.. నొప్పితో కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. నిన్న ఆస్పత్రిలో చేరగా, నేడూ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రేపు నమీబియాతో జరిగే మ్యాచులో ఆడటం అనుమానమేనని సమాచారం. ఫిట్‌నెస్ ఆధారంగా FEB 15 పాక్‌తో మ్యాచ్ ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నారు.
News February 11, 2026
తిరుమల కొండపై పూలు ఎందుకు ధరించరు?

శ్రీవారు అలంకార ప్రియుడు. కొండపై పూసే ప్రతి పువ్వు స్వామివారికే చెందాలనేది భక్తుల విశ్వాసం. పూర్వం ఓ శిష్యుడు దేవుడికి అర్పించాల్సిన పూలను తాను ధరించాడు. అలా ‘పరిమళ ద్రోహం’ చేసినట్లు పురాణ గాథ. అందుకే, అప్పటి నుంచి భక్తులు కొండపై పూలు పెట్టుకోకూడదనే నియమం వచ్చింది. స్వామికి అలంకరించిన పూలను కూడా ఇతరులకు ఇవ్వకుండా పవిత్రమైన బావిలోనే వేస్తారు. ఈ నియమం పాటించడం స్వామివారిపై ఉన్న భక్తికి నిదర్శనం.
News February 11, 2026
RRBలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

<


