News September 17, 2024

మహేశ్-రాజమౌళి మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి SSMB29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన పోస్ట్ వైరలవుతోంది. ఇందులో స్టోరీ-విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ-P.S. వినోద్ అని రాసి ఉంది. కాగా దసరాకు షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News October 27, 2025

చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్.. కేసు నమోదు

image

మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ బారిన పడ్డారు. AI సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇటీవల HYD CP సజ్జనార్‌కూ ఫిర్యాదు చేశారు. కాగా అనుమతి లేకుండా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

News October 27, 2025

వయసును తగ్గించే ఆహారాలివే..

image

ప్రస్తుతం మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లతో కొంతమందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల చికిత్సలు చేయించుకోవడం, ఏవేవో క్రీములు రాసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు. ఆహారంలో బ్లూబెర్రీలు, టమాటాలు, పెరుగు, గ్రీన్ టీ, డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు హైడ్రేటెడ్‌గా ఉండటం, మెడిటేషన్ చేయడం మంచిదంటున్నారు.

News October 27, 2025

రేపు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో రేపు క్యాబినెట్ సబ్‌ కమిటీ భేటీ కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే వీటిపై ఈ సబ్‌ కమిటీ పలు సూచనలు చేసింది. రేపటి భేటీలో మరింత స్పష్టత రానుంది. డిసెంబర్ 31వ తేదీ లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నవంబర్ 7వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.