News March 19, 2025
మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు గౌరవ ఆతిథ్యాన్ని అందించిన అక్కడి యంత్రాంగానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరలవుతోంది. ఇందులో జక్కన్న వర్కింగ్ టైటిల్ను SSMB29గా పేర్కొనడం గమనార్హం. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.
Similar News
News March 19, 2025
ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం: భట్టి

TG: గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంటుందన్నారు.
News March 19, 2025
విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసింది: లోకేశ్

AP: ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారనడం సరికాదని చెప్పారు. కాగా బొత్సతో చర్చకు సిద్ధమని లోకేశ్ చెప్పారు. ఐటీ సిలబస్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ఆయనను డిమాండ్ చేశారు.
News March 19, 2025
IPL: ఆ మ్యాచ్ రీషెడ్యూల్ ?

ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్లో జరగాల్సిన KKRvsLSG మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. అదే రోజు శ్రీరామనవమి ఉండడంతో కోల్కతా వ్యాప్తంగా భారీగా ఊరేగింపులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఊరేగింపులకు, ఇటు మ్యాచుకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారనుంది. ఈ కారణంతో మ్యాచును రీషెడ్యూల్ చేసే ఛాన్సుంది. గత ఏడాది KKRvsRR మ్యాచునూ ఇదే కారణంతో వాయిదా వేశారు.