News February 5, 2025

OTTలోకి మహేశ్ ‘ముఫాసా’.. ఎప్పుడంటే?

image

‘ది లయన్ కింగ్’ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’కు థియేటర్లలో మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 18వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో వీడియో ఆన్ డిమాండ్ కింద స్ట్రీమింగ్ కానుంది. అంటే, డబ్బులు చెల్లించి ‘ముఫాసా’ను చూడొచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫ్రీగా చూసేయొచ్చు. తెలుగులో ముఫాసాకు మహేశ్ వాయిస్ అందించారు.

Similar News

News April 2, 2026

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

image

ఇరాన్ యుద్ధాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని పొరుగు దేశం(పాకిస్థాన్) కవ్విస్తే అంతకు రెట్టింపు సమాధానం చెబుతామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. కేరళలో సైనిక్ సమ్మేళన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. Op సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు.

News April 2, 2026

హార్ముజ్‌లో ఇండియన్స్ సేఫ్: ఇరాన్

image

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతపై ఇరాన్ భరోసా ఇచ్చింది. ‘మా ఇండియన్ ఫ్రెండ్స్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు’ అని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఇండియాకు రావాల్సిన 19 చమురు నౌకలతో పాటు వేలాది మంది భారత సిబ్బంది యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం జరిపిన దౌత్య చర్చల ఫలితంగా ఇప్పటికే కొన్ని నౌకలు సేఫ్‌గా స్వదేశానికి చేరుకున్నాయి.

News April 2, 2026

బీజేపీతో జాగ్రత్త.. TDPకి ఆప్ ఎంపీ హెచ్చరిక

image

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీదని, ఆ పార్టీ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పుడు అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉందని, కేంద్రం నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకోవాలని సూచించారు.