News September 6, 2025
కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

GST సవరణలో భాగంగా పలు కార్ల ధరలు భారీగా తగ్గనున్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి. కానీ మహీంద్రా కంపెనీ ముందే శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచే వారి SUV వాహనాలపై జీఎస్టీ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రూ.1.56 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రామిస్ చేయడమే కాదు.. చేసి చూపిస్తాం. థాంక్యూ మహీంద్రా ఆటో’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Similar News
News September 6, 2025
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్‌హిట్ సినిమా

రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘సు ఫ్రం సో’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 9 నుంచి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ తొలుత కన్నడలో రిలీజై ఆకట్టుకుంది. తర్వాత తెలుగులోనూ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది.
News September 6, 2025
OFFICIAL: టీమ్ ఇండియాకు నో స్పాన్సర్

ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగుతోంది. తాజాగా శుభ్‌మన్ గిల్, శివమ్ దూబే ధరించిన జెర్సీలపై ఎలాంటి స్పాన్సర్ లోగో లేదు. దీంతో జట్టుకు ఎలాంటి స్పాన్సర్ లేరని అధికారికంగా తేలిపోయింది. మరోవైపు ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ అన్ని మ్యాచులు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సిరీస్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆడబోమని తెలిపారు.
News September 6, 2025
28న BCCI మీటింగ్.. ప్రెసిడెంట్ ఎన్నికపై చర్చ!

రోజర్ బిన్నీ రాజీనామాతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో అధ్యక్ష ఎన్నికపై చర్చించేందుకు ఈనెల 28న బోర్డు సమావేశం కానుంది. అలాగే మిగతా పోస్టుల భర్తీపైనా చర్చించనుంది. అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడతారనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా అదేరోజు దుబాయ్‌లో ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. దీంతో భారత్ ఫైనల్‌కు వెళ్తే BCCI నుంచి ఎవరూ హాజరుకాకపోవచ్చు.