News November 11, 2024

సిద్ధిఖీ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

image

NCP మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో నలుగురిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో అదుపులోకి తీసుకున్నారు. Oct 12న సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి ఆఫీస్‌లో ఉన్నప్పుడు కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపగా మరణించారు. ఈ కేసులో దాదాపు 20 మంది అరెస్టయ్యారు.

Similar News

News November 13, 2024

బుల్డోజర్ యాక్షన్: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు వార్నింగ్

image

బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు, అధికారులు జడ్జిలుగా మారి వ్యక్తులను దోషులుగా నిర్ధారించకూడదని, వారి ఆస్తులను ధ్వంసం చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ నిజంగానే నేరనిరూపణ జరిగినా ఇళ్లను కూల్చకూడదని, అలా చేస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడతారని గుర్తుచేసింది.

News November 13, 2024

పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఫోన్

image

TG: పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్ట్‌పై ఆందోళన చెందొద్దని, ధైర్యంగా పోరాడాలని కేటీఆర్ సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత నరేందర్ భార్య శ్రుతితో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కాగా లగచర్ల ఘటన ప్రధాన నిందితుడు సురేశ్ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News November 13, 2024

శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు

image

AP: నటి శ్రీరెడ్డిపై రాజమహేంద్రవరం పోలీసులకు టీడీపీ మహిళా నాయకురాలు మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌, హోంమంత్రి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లోనూ తెలుగు మహిళ సభ్యులు ఫిర్యాదు చేశారు.