News March 20, 2025
చాహల్ భార్యకు భరణం.. మహ్వాష్ పోస్ట్ వైరల్!

తన భార్య ధనశ్రీ వర్మకు టీమ్ఇండియా బౌలర్ చాహల్ విడాకులిచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు అంగీకరించారు.. ఈ నేపథ్యంలో చాహల్ గర్ల్‌ఫ్రెండ్ RJ మహ్వాష్ ఇన్‌స్టాలో చేసిన పోస్టు వైరలవుతోంది. ‘అబద్ధాలు, దురాశ, మోసాలకు దూరంగా ఉంచిన ఆ దేవునికి ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను చాహల్ కూడా లైక్ చేయడం గమనార్హం.
Similar News
News March 21, 2025
అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు: మంత్రి

TG: రాష్ట్రంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ప్రారంభించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనుండగా 31న హైటెక్స్‌లో ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. మెుత్తంగా 21 ప్రదేశాల్లో 23థీమ్‌లతో ఈవెంట్ నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నారు. మే7నుంచి31వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
News March 21, 2025
డీలిమిటేషన్ సదస్సుకు హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు

ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటేషన్ సదస్సుకు కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. డీఎంకే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పాల్గొననున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News March 21, 2025
ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్

ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నాగ్‌పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు. ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన వారిని పొగిడితే ఒప్పుకోమని అన్నారు. మన దేశంపై దాడి చేసిన వారిని కీర్తించడం సరికాదని హితవు పలికారు.