News February 26, 2025
‘మజాకా’ మూవీ రివ్యూ

త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మజాకా’ థియేటర్లలో విడుదలైంది. తండ్రి కొడుకులు తమ ప్రేమను దక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. సందీప్ కిషన్, రావు రమేశ్, మురళీ శర్మల నటన, ఎమోషనల్, కామెడీ సీన్లు, సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్ ఈ సినిమాకు ప్లస్. సాగదీత, స్లో సీన్లు, ఊహించేలా కథ ఉండటం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
WAY2NEWS RATING: 2.25/5
Similar News
News January 9, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ట్రంప్ సుంకాల వార్నింగ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై ఇవాళ కూడా కనిపిస్తోంది. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 66,907 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 25,861 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ICICI బ్యాంక్, అదానీ పోర్ట్స్, NTPC, ట్రెంట్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, HDFC, హిందుస్తాన్ యునిలీవర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడంతో రూ.7.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
News January 9, 2026
అబార్షన్కు భర్త అనుమతి అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

ప్రెగ్నెన్సీని కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం ఆమె శరీరంపై దాడేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల ఆమె మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపింది. తన మాట వినకుండా భార్య 14 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుందని భర్త(ప్రస్తుతం విడిగా ఉంటున్నారు) పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గర్భస్రావానికి భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.
News January 9, 2026
ముందు తూటాలు.. తర్వాతే మాటలు: USకు డెన్మార్క్ వార్నింగ్

గ్రీన్లాండ్ విషయంలో USకు డెన్మార్క్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా బలవంతంగా గ్రీన్లాండ్ను ఆక్రమించాలని చూస్తే ఆదేశాల కోసం చూడకుండానే కాల్పులు జరపాలని తమ సైన్యానికి స్పష్టం చేసింది. ‘ముందు కాల్పులు జరపండి.. ప్రశ్నలు తర్వాత అడగండి’ అనే నిబంధన అమల్లో ఉందని డెన్మార్క్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇది కేవలం గ్రీన్లాండ్ సమస్యే కాదని, నాటో కూటమి మనుగడకే ప్రమాదమని డెన్మార్క్ హెచ్చరించింది.


