News April 16, 2025
100రోజులు కాకముందే పెను విధ్వంసం: జో బైడెన్

వృద్ధాప్య అమెరికన్లకు కనీస ఆదాయం అందించే సోషల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిధులను US ప్రభుత్వం తగ్గించిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. DOGE పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఫైరయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం 100రోజుల పాలన కాకముందే ప్రభుత్వం చరిత్రలో చూడని విధ్వంసం, నష్టం సృష్టించిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రసంగించారు.
Similar News
News January 19, 2026
రైతుభరోసా డబ్బులు ఎప్పుడు.. రైతుల ఎదురుచూపులు

TG: యాసంగి సీజన్ ‘రైతుభరోసా’ కోసం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చిస్తారని వార్తలు వచ్చినా ఎలాంటి ప్రస్తావన రాలేదు. ప్రస్తుతం శాటిలైట్ సర్వే ద్వారా పంట భూములను గుర్తిస్తోంది. అది పూర్తయ్యాక ఎకరానికి రూ.6వేల చొప్పున ఖాతాల్లో వేయనుంది. అది ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై సర్కారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. FEB లేదా మార్చిలో డబ్బులు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News January 19, 2026
డియర్ పేరెంట్స్.. పిల్లల ఆరోగ్యంతో ఆటలొద్దు!

స్క్రీన్ టైమ్ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదో పనుందనో, అన్నం తినట్లేదనో, రిలాక్స్ అవుదామనో పిల్లలకు ఫోన్, TVలు అలవాటు చేస్తున్నారు. అయితే అలా చేస్తే వారి మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, ఫిజికల్ యాక్టివిటీస్, రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ వంటివి లోపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫోకస్ చేయడం, భాష నేర్చుకోవడం కూడా ఆలస్యమవుతుందని చెబుతున్నారు.
News January 19, 2026
సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని<


