News April 2, 2025
జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లోని క్యుషు కోస్టల్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఇటీవల మయన్మార్‌లో భారీ భూకంపం కారణంగా 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల థాయిలాండ్, అఫ్గానిస్థాన్, భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News April 6, 2025
పశ్చిమ బెంగాల్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం

పశ్చిమ బెంగాల్ సిలిగుడిలో మత సామరస్యం వెల్లివిరిసింది. శ్రీరామ నవమి శోభాయాత్ర చేస్తున్న భక్తులను ముస్లిం యూత్ పూలు చల్లుతూ ఆహ్వానించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి వాటర్ బాటిల్స్ అందజేశారు. భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సిలిగుడిలో అన్ని మతాల వారు సోదర భావంతో నివసిస్తారని, మత వివక్ష ఉండదని భక్తులు తెలిపారు.
News April 6, 2025
ఘోరం: భార్య పెట్టే టార్చర్ భరించలేక..

భార్య వేధింపులు తాళలేక మరో భర్త తనువు చాలించాడు. వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో జరిగింది. రామచంద్ర బర్జెనాకు రెండేళ్ల కింద రూపాలితో వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె సంతానం. పెళ్లి నాటి నుంచి భార్య మానసికంగా వేధిస్తోందంటూ ఓ వీడియో రికార్డ్ చేసి అతను సూసైడ్ చేసుకున్నాడు. రామచంద్ర తల్లి ఫిర్యాదుతో రూపాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 6, 2025
ఏఐ వీడియోలు అనటం హాస్యాస్పదం: జగదీశ్ రెడ్డి

TG: కంచ గచ్చిబౌలిలో జరిగిన విధ్వంస దృశ్యాల్ని సీఎం రేవంత్ ఏఐ వీడియో అనటం హాస్యాస్పదంగా ఉందని BRS ఎమ్మెల్యే జగదీశ్ అన్నారు. నెమళ్ల అరుపులు, జింకపై కుక్కల దాడి, బుల్డోజర్లతో భూమిని చదును చేయటం కూడా ఏఐ సృష్టేనా అని ప్రశ్నించారు. పాకిస్థాన్, చైనా యుద్ధాలతో ఏఐకి సంబంధమేంటని, సీఎం వ్యాఖ్యలతో తెలంగాణ పరువు పోతోందన్నారు. రేవంత్ నిర్ణయాలతో రాష్ట్రం నష్టపోతోందని ఆరోపించారు.