News July 18, 2024

వయనాడ్‌లో 7లక్షల ఓట్ల మెజారిటీయే లక్ష్యం: ఏఐసీసీ

image

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీకి 7లక్షల ఓట్ల మెజారిటీ తీసుకురావాలని AICC లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై స్థానిక నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. రాహుల్ గాంధీకి ఇక్కడ 2019లో 4.31లక్షలు, 2024లో 3.64లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆయన ఈ స్థానాన్ని వదులుకోవడంతో బై ఎలక్షన్ రానుంది.

Similar News

News December 12, 2025

పంచాయతీ ఎన్నికల్లో 84.28% ఓటింగ్

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. 53.57లక్షల ఓటర్లకు గానూ 45.15లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ 90శాతం మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి వరకు 3,300 సర్పంచ్, 24,906 వార్డు స్థానాల్లో కౌంటింగ్ పూర్తైంది.

News December 12, 2025

కొబ్బరికాయకు కుంకుమ పెడుతున్నారా?

image

హిందూ సంప్రదాయంలో పూజలు, శుభకార్యాలప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరిపై కుంకుమ బొట్టు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం శుద్ధత అని, దేవుడికి సమర్పించే ప్రసాదం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలని అంటున్నారు. తెల్లటి గుజ్జుపై కుంకుమ ఉంచడం వల్ల తినదగిన నైవేద్యం స్వచ్ఛత దెబ్బతింటుందని, కావాలంటే పీచుపై పెట్టాలని సూచిస్తున్నారు.

News December 12, 2025

నేడు విశాఖలో 9 IT సంస్థల క్యాంపస్‌లకు భూమిపూజ

image

AP: కాగ్నిజెంట్, సత్వా గ్రూప్‌తో పాటు విశాఖలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్‌ల నిర్మాణాలకు నేడు CM CBN, మంత్రి లోకేశ్ భూమిపూజ చేయనున్నారు. మధురవాడలో 1.టెక్ తమ్మిన, 2.నాన్ రెల్ టెక్నాలజీస్, 3.ACN ఇన్ఫోటెక్, కాపులుప్పాడలో 4.ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, 5.ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, 6.మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, 7.క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రై. లిమిటెడ్ సంస్థలకు శంకుస్థాపనలు జరగనున్నాయి.