News March 16, 2024

17 స్థానాల్లో BJPని గెలిపించండి: మోదీ

image

తెలంగాణ ప్రజల సమస్యలు తన వరకు చేరాలంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17కు 17 స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. ‘మార్పునకు మోదీ గ్యారంటీ అవసరం. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ’ అని అన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని BRS మోసం చేస్తే.. దళిత డిప్యూటీ సీఎంను కాంగ్రెస్ అవమానించిందని విమర్శించారు.

Similar News

News October 18, 2025

నెలసరికి ముందు ఇవి మేలు..

image

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే PMS అంటారు. దీని లక్షణాలను తగ్గించడానికి ఆహారంలో డ్రైఫ్రూట్స్‌, మిల్లెట్స్‌, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు తగ్గించాలి. ఇవి ఈస్ట్రోజన్, ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్లపై ప్రభావం చూపడం వల్ల నెలసరి సమస్యలు వేధిస్తాయి.

News October 18, 2025

పండుగవేళ ఆఫర్ల మాయలో పడకండి

image

పండుగ సమయాల్లో వివిధ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఒక్కసారి వాటి మాయలో పడితే బడ్జెట్ దాటిపోయి పండుగ సంతోషం ఆవిరైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే అప్పులు తీసుకొని షాపింగ్ చేయడం మానుకోవాలి. వస్తువు కొనేముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. నాణ్యతలో రాజీ పడకూడదు. డిస్కౌంట్లు ఏ వెబ్‌సైట్‌లో తక్కువగా వస్తున్నాయో చెక్ చేసుకోవాలి. తక్కువకు వస్తున్నాయి కదా అని అనవసరమైనవి కొనొద్దు.

News October 18, 2025

వర్కింగ్ ఉమెన్స్.. ఒత్తిడి తగ్గాలంటే?

image

ఇంట్లో, ఆఫీసులో పనుల కారణంగా వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువగా ఒత్తిడి గురవుతుంటారు. అలాంటివారు రోజూ మెడిటేషన్, వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘మీకు వచ్చినా, రాకపోయినా కాగితాలపై బొమ్మలు, పెయింటింగ్స్ వేయాలి. దీనివల్ల మీ ఫోకస్ పెరుగుతుంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని తినాలి. మొబైల్ ఫోన్ పక్కనపెట్టి పిల్లలు, పెట్స్‌తో ఆడుకోవడం, మ్యూజిక్ వినడం స్ట్రెస్ తగ్గించడంలో మేలు చేస్తాయి’ అని పేర్కొంటున్నారు.