News December 1, 2024
‘OG అప్డేట్ ఇవ్వకుండా సావనులేరా’.. మేకర్స్ ఫన్నీ రిప్లై

సుజీత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ మూవీ నుంచి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ‘అప్డేట్ ఇచ్చి సావురా’ అని మేకర్స్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘అప్డేట్ ఇవ్వకుండా సావను లేరా. ఉన్నప్పుడు ఇస్తా. ప్రస్తుతానికి సీజ్ ది షిప్’ అని DVV ఎంటర్టైన్మెంట్ ఫన్నీ రిప్లై ఇచ్చింది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో OG షూటింగ్ ఆలస్యమవుతోంది.
Similar News
News January 6, 2026
సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో 2 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) తెలిపింది. 18వ తేదీన రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ట్రైన్ బయల్దేరనుంది. 19న మధ్యాహ్నం 3.30కు చర్లపల్లి నుంచి విశాఖకు రైలు స్టార్ట్ అవుతుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. రేపు ఉదయం నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.
News January 6, 2026
రాష్ట్రంలో 1095 పోస్టులకు నోటిఫికేషన్

AP: <
News January 6, 2026
ఏపీలో వేగంగా ఎయిర్పోర్టులు!

ఏపీలో విమానాశ్రయాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, పుట్టపర్తిలో డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇటీవలే విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. రాజమండ్రిలో పనులు జరుగుతుండగా, భోగాపురంలో పూర్తి కావొచ్చింది. కొత్తగా కుప్పం, దొనకొండ (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు)లో ఎయిర్పోర్టులకు ప్లాన్ చేస్తున్నారు.


