News October 6, 2024
‘కల్కి’ శాటిలైట్ రైట్స్‌కు మేకర్స్ స్ట్రగుల్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా దసరాకు టీవీల్లో వస్తుందనుకున్న వారికి నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కొనుగోలుకు కంపెనీలు ఇంట్రెస్ట్ చూపించట్లేదని సినీవర్గాలు పేర్కొన్నాయి. మేకర్స్ స్టార్ మా గ్రూప్‌ను సంప్రదించగా ధర చూసి వద్దని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. జీ గ్రూప్‌తో చర్చలు జరుపగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం OTTలో రిలీజైంది.
Similar News
News December 4, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గంటల వ్యవధిలోనే <<18465069>>మరోసారి<<>> బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ రూ.920 తగ్గి రూ.1,29,660కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.850 పతనమై రూ.1,18,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 4, 2025
విష్ణుమూర్తిని ఎందుకు కొలవాలి?

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః||
అన్నింటినీ నియంత్రించే ఈశానుడు, ప్రాణాన్నిచ్చే ప్రాణదుడు, గొప్పవాడైన జ్యేష్ఠుడు, సకల జీవులకు ప్రభువైన ప్రజాపతి, బంగారు గర్భం కల్గిన హిరణ్యగర్భుడు, భూమిని తనలో ఇముడ్చుకున్న భూగర్భుడు, జ్ఞానానికి అధిపతైన మాధవుడు, మధు అనే రాక్షసుడిని సంహరించిన మధుసూధనుడైన విష్ణుమూర్తిని జ్ఞానం కోసం నమస్కరించాలి.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 4, 2025
ఒక్క సాంగ్ వాడినందుకు ఇళయరాజాకు ₹50 లక్షలు చెల్లింపు!

లెజెండరీ మ్యూజీషియన్ ఇళయరాజా ‘Dude’ సినిమాపై వేసిన కాపీరైట్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ చిత్రంలో ‘కరుత్త మచ్చాన్’ సాంగ్‌ను అనుమతి లేకుండా వాడారని ఆయన చిత్రయూనిట్‌పై కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ పరిష్కరించుకున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఆ సాంగ్ ఉపయోగించినందుకు రూ.50లక్షలు చెల్లిస్తామని ఇళయరాజాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాయి.


