News July 3, 2024

మహేశ్ మూవీలో విలన్‌గా మలయాళ హీరో?

image

మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Similar News

News November 8, 2025

హిడ్మాను పట్టుకునేందుకు పక్కా ప్లాన్

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాను పట్టుకునేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు పక్కా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న ఆ రాష్ట్ర సరిహద్దుల్లో 2 వేల మంది జవాన్లతో చుట్టుముట్టారు. డ్రోన్లతో నిఘా పెట్టారు. మ్యాపింగ్, థర్మల్ ఇమేజింగ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో అబూజ్‌మడ్ అడవులను జల్లెడ పడుతున్నారు. బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

News November 8, 2025

NEEPCLలో 98 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NEEPCL)లో 98 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ITI, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: neepco.co.in/

News November 8, 2025

జిల్లేడు పూలతో గణపతి పూజ ఎందుకు చేయాలి?

image

గణపతి పూజలో జిల్లేడాకు, పూలు చాలా కీలకం. ఇవి సకల శుభాలకు మూలమని నమ్మకం. వీటితో గణపతిని ఎలా పూజించాలో పండితులు ఇలా వివరిస్తున్నారు. పీటను శుభ్రం చేసి, బియ్యప్పిండి ముగ్గేసి, గంధం, బొట్లు పెట్టి, 21 జిల్లేడాకులను అమర్చాలి. వాటి నడుమ గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆయనకెంతో ఇష్టమైన జిల్లేడు పూల మాల వేసి, ఆ పూలతోనే పూజ చేయాలి. ఇలా ఆయనను పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడని, శుభం చేకూరుస్తాడని నమ్మకం.