News October 3, 2025
మూడో భార్యకూ విడాకులు ఇవ్వనున్న మాలిక్?

సానియా మీర్జా మాజీ భర్త, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య సనా జావెద్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆమె మూడో భార్య కాగా ఇది మూడో విడాకులు. తొలుత ఆయేషాను పెళ్లాడిన మాలిక్ 8 ఏళ్ల తర్వాత ఆ బంధానికి ముగింపు పలికారు. 2010లో సానియాను పెళ్లాడారు. 13 ఏళ్ల తర్వాత ఆమెకూ విడాకులిచ్చారు. వీరికి ఓ కొడుకు ఉన్నారు. ఇక 2024లో సనాను పెళ్లి చేసుకున్న ఆయన ఏడాదిలోనే విడాకులకు సిద్ధమయ్యారు.
Similar News
News October 4, 2025
AP, TG న్యూస్ రౌండప్

☛ రేపు HYDకు AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చ
☛ మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ROB నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
☛ నవంబర్ 5 నుంచి 9 వరకు కడప దర్గా ఉరుసు మహోత్సవం
☛ TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపు పునః ప్రారంభం
News October 4, 2025
₹5కోట్ల ఇన్సూరెన్స్… హత్య చేసి ఆపై క్లెయిమ్ కోసం నాటకం

ఓ గ్యాంగ్ ₹5.2కోట్ల ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తిని హత్యచేసి ఆ మొత్తం క్లెయిమ్‌కోసం నకిలీ భార్యతో డ్రామా ఆడించింది. పక్షవాతం ఉన్న కౌల్పేట్ (KA)కు చెందిన గంగాధర్‌కు బీమా ఉంది. గమనించిన ముఠా అతణ్ని చంపి బాడీని టూవీలర్‌పై పెట్టి కారుతో గుద్దించింది. ముఠాలోని మహిళతో CLAIM చేయించింది. డెడ్‌బాడీ విషయం తెలిసి పోలీసులు అసలు భార్యను విచారించగా టూవీలర్ లేదని తేలింది. తీగలాగి మొత్తం ముఠాను అరెస్టు చేశారు.
News October 3, 2025
రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు!

ఈనెల 19 నుంచి AUSతో జరగనున్న వన్డే సిరీస్‌కు రేపు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ వన్డేలు మినహా టెస్ట్, టీ20ల నుంచి రిటైరైన విషయం తెలిసిందే. దీంతో AUSతో మ్యాచులకు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలారోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న ‘రోకో’ జోడీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగిస్తారా లేక మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.