News March 19, 2024
BRSకు మల్లారెడ్డి గుడ్ బై?
TG: మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు కుదరకపోతే బీజేపీలోకి వెళ్లేందుకైనా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 25, 2024
సర్పంచులు, ఎంపీటీసీలకు గుడ్ న్యూస్
TG: గ్రామాల్లో సర్పంచులు, MPTCలు, ZPTCలు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. BRS పెట్టిన బకాయిలు ₹1,300కోట్లు ఉన్నాయన్నారు. తొలుత ₹10లక్షల లోపు బిల్లులను సెటిల్ చేసే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బకాయిల విలువ దాదాపు ₹400కోట్లు ఉందని తెలిపారు. బిల్లులను పెండింగ్‌లో పెట్టిన BRS నేతలు మళ్లీ ధర్నాలు చేస్తామనడం సమంజసం కాదన్నారు.
News December 25, 2024
గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047 ఫ్రేమ్ వర్క్ బాధ్యతల్లోనూ పాలుపంచుకోవాలని పేర్కొంది. దీనిపై CM ప్రతి శుక్రవారం నిర్వహించే సమీక్షలో RTGSతోపాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపింది.
News December 25, 2024
తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ బలహీనపడుతుందని IMD వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా బంగాళాఖాతంలో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.