News April 6, 2024
అయోధ్య రాముడిని దర్శించుకున్న మల్లారెడ్డి

TG: మాజీ మంత్రి మల్లారెడ్డి అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు కూడా బాలరాముడి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ‘శ్రీరాముడు అందరి దేవుడు. బాలరాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత మల్లారెడ్డి విహార యాత్రలు, ఆథ్యాత్మిక యాత్రలతో కాలక్షేపం చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
మా రాజీనామాలను ఆమోదించండి: ఎమ్మెల్సీలు

AP: వైసీపీ, MLC పదవులకు రిజైన్ చేసిన ఆరుగురు నాయకులు ఇవాళ మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశమయ్యారు. ఎలాంటి ప్రలోభాలకూ గురికాకుండా స్వచ్ఛందంగానే తాము రిజైన్ చేశామని, వాటిని ఆమోదించాలని కోరారు. రాజీనామా వెనక్కు తీసుకునే ఆలోచన ఉందా? అని ఛైర్మన్ అడగగా లేదని తేల్చిచెప్పారు. మోషేన్ రాజును కలిసిన వారిలో పద్మశ్రీ, చక్రవర్తి, మర్రి రాజశేఖర్, వెంకటరమణ, జాకియా, పోతుల సునీత ఉన్నారు.
News December 1, 2025
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.
News December 1, 2025
క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.


