News October 7, 2024
కాసేపట్లో చంద్రబాబును కలవనున్న మల్లారెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కాసేపట్లో కలవనున్నారు. మల్లారెడ్డి మనుమరాలు, రాజశేఖర్ కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వారు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. కాగా వీరితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా బాబుతో భేటీ అవుతారని సమాచారం.
Similar News
News October 28, 2025
బాలీవుడ్ నటుడి మంచి మనసు

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మంచి మనసు చాటుకున్నారు. ‘రామాయణ’ సినిమాకు తాను తీసుకుంటున్న పారితోషికాన్ని క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. హాలీవుడ్ మాస్టర్ పీస్ చిత్రాలకు భారత్ నుంచి సమాధానంగా ‘రామాయణ’ నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకొన్ని రోజులు తన పాత్ర షూట్ మిగిలి ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
News October 28, 2025
ఇంట్లో కాలుష్యానికి వీటితో చెక్

ప్రస్తుతకాలంలో కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం కష్టంగా మారింది. ఆరుబయటే కాదు ఇంట్లో కూడా కాలుష్యం విస్తరిస్తోంది. దీన్ని తగ్గించాలంటే ఇంట్లో కొన్నిమొక్కలు పెంచాలంటున్నారు నిపుణులు. బోస్టన్ ఫెర్న్, స్పైడర్ ప్లాంట్, వీపింగ్ ఫిగ్, పీస్ లిల్లీ, ఇంగ్లిష్ ఐవీ మొక్కలు గాలిని శుభ్రం చేయడంలో సహాయం చేస్తాయి. గాలి కాలుష్యాన్ని తొలగించి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయంటున్నారు.
News October 28, 2025
శివుడి కోసం సతీదేవి ఏం చేసిందంటే..?

సతీదేవికి శివునిపై ఉన్న ప్రేమను, భర్త గౌరవం పట్ల ఆమెకున్న నిబద్ధతను దక్షయజ్ఞ ఘట్టం మనకు నిరూపిస్తుంది. శివుడిని దక్షుడు అవమానించడం ఆమె సహించలేకపోయింది. శివుని ఔదార్యాన్ని వివరించి, దక్షుడి అహంకారాన్ని ఖండించింది. శివునిపై ద్వేషం పెంచుకున్న తండ్రి నుంచి వచ్చిన ఈ శరీరం శివుని అవమానంతో కలుషితమైందని భావించింది. అందుకే, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి యోగాగ్ని ద్వారా దేహత్యాగం చేసింది. <<-se>>#Shakthipeetham<<>>


