News June 18, 2024
మాల్యా కుమారుడి పెళ్లి.. వారం పాటు వేడుకలు
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ్ మాల్యా పెళ్లి చేసుకోనున్నారు. తన ప్రియురాలు జాస్మిన్ను త్వరలోనే పెళ్లాడనున్నట్లు ఇన్‌స్టా వేదికగా ఆయన ప్రకటించారు. వీరి పెళ్లి వేడుకలు వారం రోజుల పాటు జరగనుండటం విశేషం. అమెరికాకు చెందిన జాస్మిన్‌తో గత ఏడాది అక్టోబరులో సిద్ధార్థ్‌కు నిశ్చితార్థమైంది.
Similar News
News February 3, 2025
15న పార్లమెంటులో ‘రామాయణం’ ప్రదర్శన
‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ యానిమేటెడ్ చిత్రాన్ని ఈ నెల 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నట్లు గీక్ పిక్చర్స్ వెల్లడించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపింది. 1993లో ఈ సినిమాను ఇండో-జపనీస్ టీమ్ తెరకెక్కించింది. 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. రచయిత విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి రైటర్‌గా పనిచేశారు.
News February 3, 2025
గిరిజన శాఖను బ్రాహ్మణుడు/నాయుడికి ఇవ్వాలి: సురేశ్ గోపి
గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘గిరిజన కులాలకు చెందిన వ్యక్తే ఆ శాఖ మంత్రి అవుతున్నారు. ఇది దేశానికి శాపం. బ్రాహ్మణుడు/నాయుడు ఆ శాఖ బాధ్యతలు చేపడితే మార్పు ఉంటుంది’ అని పేర్కొన్నారు. కులాలపై కామెంట్లు చేసిన ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కేరళ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
News February 3, 2025
English Learning: Antonyms
✒ Frivolous× Solemn, significant
✒ Frantic× Subdued, gentle
✒ Frugality× Lavishness, extravagance
✒ Gloom× Delight, mirth
✒ Gather× Disperse, Dissemble
✒ Gorgeous× Dull, unpretentious
✒ Glut× Starve, abstain
✒ Grisly× Pleasing, attractive
✒ Gracious× Rude, Unforgiving