News July 10, 2024
లావణ్యపై మాల్వి ఫిర్యాదు.. కేసు నమోదు

నటుడు రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా HYDలోని ఫిల్మ్ నగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. తనపై <<13570128>>లావణ్య<<>> తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన సోదరుడికి వాట్సాప్, ఇన్స్టాలో అనుచిత సందేశాలు పంపుతున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. మరోవైపు రాజ్ తరుణ్, మాల్విపై కొన్ని ఆధారాలతో నార్సింగి PSలో లావణ్య రెండోసారి ఫిర్యాదు చేశారు.
Similar News
News September 16, 2025
మద్యంమత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

MPలోని ఇండోర్లో ఓ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనంతో బీభత్సం సృష్టించాడు. వాహనాలనే కాకుండా రోడ్డు పక్కనే నడుస్తున్న ప్రజలను కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. బైకులను ఢీకొట్టి వాటిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. ఓ బైకును లాక్కెళ్లడంతో దాని ట్యాంక్ పేలి లారీ మొత్తం తగలబడిపోయింది. డ్రైవర్ ఫుల్గా తాగేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.
News September 16, 2025
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరో రోజు పొడిగింపు

AY 2025-26కు గానూ ITR ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే ఈ గడువు ముగియాల్సింది. దానిని SEP 15కు పొడిగించింది. ఇప్పుడు మరొక్క రోజు(సెప్టెంబర్ 16 వరకు) పెంచింది. ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్లో టెక్నికల్ గ్లిట్చ్ కారణంగా ఫైలింగ్కు చాలామంది ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించినట్లు తెలస్తోంది. గడువులోగా ఫైలింగ్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
News September 16, 2025
ట్రంప్ హింట్.. అమెరికా చేతికి TikTok!

సెప్టెంబర్ 17కల్లా టిక్ టాక్ పగ్గాలు అమెరికా చేతికి రాకపోతే ఆ యాప్ను తమ దేశంలో బ్యాన్ చేస్తామని US ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా-అమెరికా ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘దేశంలోని యువత ఎంతగానో కోరుకుంటున్న ఓ డీల్ దాదాపుగా పూర్తైంది’ అని అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేశారు. త్వరలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడనున్నారు. డీల్ కోసం ఫ్రేమ్ వర్క్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.