News January 21, 2025

కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసహనం

image

R.G.Kar ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవితఖైదు విధించటం పట్ల బెంగాల్ CM మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసు ‘అత్యంత అరుదు’ కాదన్న కోర్టు తీర్పు షాక్‌కు గురి చేసిందని చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ మెుదటి నుంచి దోషికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు మమత ట్వీట్ చేశారు.

Similar News

News October 31, 2025

‘బాహుబలి ది ఎపిక్’ మూవీ రివ్యూ

image

‘బాహుబలి ది ఎపిక్’లో 1, 2 పార్టులను కలిపి ఎడిట్ చేసినా స్క్రీన్ ప్లే మారలేదు. బాహుబలి తిరిగి మాహిష్మతికి వచ్చే సీన్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. సాంగ్స్, యుద్ధం సీన్లను ట్రిమ్ చేశారు. 90 నిమిషాల సీన్లు కట్ అయినా మూవీపై ప్రభావం పడలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. కీలక సన్నివేశాలతో కథను నడిపేందుకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తమన్నా లవ్ ట్రాక్, సుబ్బరాజు కామెడీ సీన్స్ లేకపోవడం కాస్త మైనస్.

News October 31, 2025

INDvsAUS రెండో టీ20కి వర్షం ముప్పు

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో T20 జరగనుంది. అయితే మెల్‌బోర్న్‌లో మ్యాచ్ జరిగే టైమ్‌కి 93% వర్షం పడే అవకాశాలున్నాయని AccuWeather పేర్కొంది. వర్షం ఆగితే మైదానాన్ని ఆరబెట్టే టెక్నాలజీ అక్కడ ఉంది. కానీ వర్షం నుంచి బ్రేక్ లభించే అవకాశాలు తక్కువేనని తెలిపింది. ఈ మైదానంలో T20ల్లో ఇరు జట్లు 4సార్లు తలపడగా చెరో 2మ్యాచులు గెలిచాయి. కాన్‌బెర్రాలో జరగాల్సిన తొలి T20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

News October 31, 2025

బీట్‌రూట్‌తో బ్యూటీ

image

బీట్‌రూట్‌ను డైట్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. అయితే దీంతో అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. * బీట్‌రూట్ రసం, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో మచ్చలు తగ్గుతాయి. * బీట్‌రూట్ రసం, ఓట్స్ కలిపి స్క్రబ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి చర్మం మెరుస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా చర్మం ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.