News January 2, 2025
BSFపై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
చొరబాటుదారులు బెంగాల్లోకి ప్రవేశించేలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహకరిస్తోందని CM మమత ఆరోపించారు. BSF పరిధిలోని ఇస్లాంపుర్, సితాయ్, చోప్రా సరిహద్దుల నుంచి చొరబాటుదారుల్ని అనుమతిస్తున్నారని అన్నారు. తద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరిచి, ఆ నెపాన్ని తమపై నెడుతున్నారని ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో BSF అక్రమాలకు మద్దతిస్తూ తమను నిందించవద్దని రాజకీయ ప్రత్యర్థులకు సూచించారు.
Similar News
News January 5, 2025
అందుకే భూమి లేనివారికీ రూ.12వేలు: CM
TG: సాగు చేసేవారితో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకూ రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. భూమి లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం కూడా తమను ఆదుకోవడం లేదని పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందని సీఎం చెప్పారు. వారు కూడా సమాజంలో భాగమేనని గుర్తించి, ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
News January 5, 2025
ఇలాంటి వారు చపాతీలు తినకూడదా?
చపాతీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిని కొందరు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలసట, ఆయాసంతో బాధపడేవారు తినకూడదు. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లను బర్న్ చేయడం వీరికి కష్టం. డయాబెటిస్ రోగులు కూడా వీటిని తీసుకోకపోవడం ఉత్తమం. అమిలో పెక్టిన్ అనే స్టార్చ్ మూలాలు రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి. అధిక బరువు, ఊబకాయం, థైరాయిడ్, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.
News January 5, 2025
మారుతి 40 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన టాటా
గత ఏడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్ మోడల్గా టాటా పంచ్ నిలిచింది. 2024లో 2.02 లక్షల పంచ్ మోడల్ కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మారుతి వ్యాగన్ R, ఎర్టిగా, బ్రెజా, హ్యుండాయ్ క్రెటా ఉన్నాయి. కాగా 1985-2004 వరకు మారుతి 800, 2005-2017 వరకు మారుతి ఆల్టో, 2018లో డిజైర్, 19లో ఆల్టో, 2020లో స్విఫ్ట్, 2021-22లో వ్యాగన్ R, 2023లో స్విఫ్ట్ ఎక్కువగా అమ్ముడైన కార్లుగా ఉన్నాయి.