News August 31, 2024
దోషుల్ని శిక్షించాలంటూ నేడు మమత ధర్నా

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం ధర్నా చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు ఆందోళన చేపట్టాలని టీఎంసీ శ్రేణులకూ పిలుపునిచ్చారు. ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార దోషులకు మరణ దండన విధించాలని, రేప్ కేసుల్లో కఠినశిక్షలు పడేలా కేంద్ర చట్టాలను సవరించాలన్న డిమాండ్లతో ఆమె ఈ నిరసన చేపడుతున్నారు. మరోవైపు విద్యార్థులపై ఆమె నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా బీజేపీ ఏడు రోజుల ధర్నాకు పిలుపునివ్వడం గమనార్హం.
Similar News
News January 28, 2026
మాగాణి మినుములో కాండపు ఈగ – నివారణ

మాగాణి మినుముకు చీడ పీడల సమస్య ఎక్కువ. పంటకు నష్టం చేసే పురుగుల్లో కాండపు ఈగ ఒకటి. ఇది ఎక్కువగా తొలకరి పైరును ఆశించి, కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుంది. దీని నివారణకు థయామిథాక్సామ్ 70 W.S. 5గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5mlను కేజీ విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరుపై దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేక డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News January 28, 2026
కలుపు తీయనివాడు కోత కోయడు

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.
News January 28, 2026
అలాంటి పసుపుకే మంచి ధర: మార్కెటింగ్ శాఖ

TG: పసుపు పంట చేతికొస్తున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచనలు చేసింది. ఉడికించిన పసుపును 15 రోజులు ఎండబెట్టిన తర్వాతే మార్కెట్ యార్డులకు తీసుకురావాలని తెలిపింది. తేమ శాతం 12%లోపు ఉంటే మంచి ధర దక్కే అవకాశం ఉంటుందని పేర్కొంది. కాడి, గోల, చూర వంటి మలినాలు లేకుండా శుభ్రపరచిన పసుపును తేవాలని సూచించింది. NZB మార్కెట్ యార్డులో పచ్చి పసుపు విక్రయాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపింది.


