News March 13, 2025

హోలీని నిషేధించిన మమతా సర్కారు.. BJP ఫైర్

image

బెంగాల్ బీర్‌భూమ్ జిల్లా శాంతినికేతన్లో హోలీ వేడుకలను మమతా బెనర్జీ సర్కారు నిషేధించడం వివాదాస్పదంగా మారింది. ఇది యునెస్కో వారసత్వ సంపదని, రంగులు చల్లుకుంటే వృక్ష సంపదకు నష్టమని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఫారిన్ టూరిస్టులు వస్తారు కాబట్టి పండగ జరుపుకోవద్దని బ్యానర్లు కట్టించారు. FRI రంజాన్ ప్రార్థనలు ఉంటాయి కాబ్టటి 10AM లోపే రంగులు చల్లుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై BJP ఆందోళన చేస్తోంది.

Similar News

News November 13, 2025

MCEMEలో 49 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)49 గ్రూప్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/PET&PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 13, 2025

హనుమాన్ చాలీసా భావం – 8

image

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా ||
భావం: రాముడి చరిత్రను వినడానికి ఆసక్తి చూపిన వారి మనసులో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ నివాసం ఉంటారు.
సుగుణాల రాముడి కథలను వినడం, పఠించడం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది. ఫలితంగా ఆ దేవదేవుడు మన హృదయ మందిరంలో స్థిరంగా నిలుస్తాడు. నిత్యం దైవ స్మరణలో ఉంటే జీవితం ధర్మబద్ధంగా, శాంతియుతంగా ఉంటుందని ఈ శ్లోకం బోధిస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 13, 2025

ఢిల్లీ పేలుడు.. కారులో డీఎన్ఏ ఉమర్‌దే!

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్‌లో మరణించింది డాక్టర్ ఉమర్ అని అధికార వర్గాలు తెలిపాయని INDIA TODAY పేర్కొంది. కారులోని డీఎన్ఏ, ఉమర్ కుటుంబ సభ్యులతో సరిపోలిందని వెల్లడించింది. i20 కారుతో ఎర్రకోట సిగ్నల్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మరణించారు. కాగా ఉమర్ పేరిట ఉన్న మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.