News June 25, 2024
ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థికి మద్దతివ్వని మమత?

ఇండియా కూటమి తరఫున లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా కే.సురేశ్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. సురేశ్‌తో నామినేషన్ వేయించే విషయంలో ముందుగా TMCని సంప్రదించకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.
Similar News
News November 9, 2025
రెబకినా సంచలనం..

సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన WTA సింగిల్స్ ఫైనల్‌లో రెబకినా విజయం సాధించారు. ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్ సబలెంకాతో జరిగిన మ్యాచులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ కాగా 6-3, 7-6 పాయింట్లతో ఆమె టైటిల్ గెలిచారు. ఈ విజయంతో రికార్డు స్థాయిలో 5.2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ రెబకినా ఖాతాలో చేరనుంది. ఈ ట్రోఫీ అందుకున్న తొలి ఆసియన్, కజికిస్థాన్ ప్లేయర్‌గానూ ఆమె నిలిచారు.
News November 9, 2025
నవంబర్ 9: చరిత్రలో ఈరోజు

* 1877: కవి మహమ్మద్ ఇక్బాల్ జననం
* 1895: ఆధునిక ఆంధ్ర కవి దువ్వూరి రామిరెడ్డి జననం
* 1924: రచయిత, కథకుడు కాళీపట్నం రామారావు జననం
* 1978: సినీనటుడు రాజా పుట్టినరోజు
* 2005: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం
* 2009: నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా మరణం(ఫొటోలో)
* జాతీయ న్యాయ సేవల దినోత్సవం
News November 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


