News February 10, 2025

’మహామండలేశ్వర్‘ పదవికి మమత రాజీనామా

image

తాను కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ నటి మమతా కులకర్ణి ప్రకటించారు. ఇకపై సాధ్విగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. కాగా 90ల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మమత ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. ఓ డ్రగ్స్ రాకెట్‌లోనూ ఆమె పేరు వినిపించింది. ఇటీవల మహాకుంభమేళాలో ఆమె కిన్నర్ అఖాడాలో చేరి సన్యాసినిగా మారారు. కానీ దీనిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Similar News

News January 29, 2026

APPLY NOW: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 97 పోస్టులు

image

<>ఇన్‌కమ్<<>> ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ముంబై రీజియన్‌లో స్పోర్ట్స్ కోటాలో 97 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయి, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్‌లో పతకాలు సాధించినవారు అర్హులు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.incometaxmumbai.gov.in

News January 29, 2026

ఒకే రోజు రూ.25వేలు పెరిగిన కేజీ సిల్వర్ ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ సిల్వర్ రేటు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.25వేలు పెరిగి రూ.4,25,000కు చేరింది. కేవలం 3 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాన్నిచ్చింది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News January 29, 2026

నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI తేల్చింది: YCP

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CBN చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టిందని YCP విమర్శించింది. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని CBI తేల్చినట్లు వివరించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారంతో కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను CBN దెబ్బతీశారని పేర్కొంది. ‘నిజం బయటపడింది.. మీలో ఏమాత్రం నిజాయతీ ఉన్నా లెంపలేసుకుని భక్తులకు క్షమాపణలు చెప్పు CBN’ అని ట్వీట్ చేసింది.