News September 7, 2024
మమ్ముట్టి బర్త్‌డే.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన మోహన్‌లాల్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టిన రోజు సందర్భంగా అగ్రహీరో మోహన్‌లాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే డియర్ ఇచ్చక్కా’ అంటూ ఓ స్పెషల్ ఫొటోను Xలో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే డియర్ ఇచ్చక్కా’ అని రాసుకొచ్చారు. మమ్ముట్టిని మోహన్‌లాల్ ప్రేమగా ‘ఇచ్చక్కా’(పెద్దన్న) అని పిలుస్తుంటారు. కాగా తమ అభిమాన హీరోలిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.
Similar News
News November 11, 2025
కోడిగుడ్డు పెంకుతో ఇన్ని లాభాలా!

కోడిగుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని పిల్లలకు ఉడికించిన గుడ్లు ఇస్తుంటారు. అయితే, కేవలం గుడ్డులోపల ఉన్న పదార్థం మాత్రమే కాదు.. బయట ఉండే పెంకుతోనూ చాలా లాభాలు ఉంటాయి.- కోడిగుడ్డు పెంకులను పడేయకుండా మొక్కల కుండీల్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి. -గుడ్డు పెంకులను మెత్తగా చేసి తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మం మెరుస్తుంది. – పెంకుల పొడిలో బేకింగ్ సోడా, కొబ్బరినూనె కలిపి అప్లై చేస్తే దంతాలు మెరుస్తాయి.
News November 11, 2025
ఏపీలో నేడు..

▶ గుంటూరులో జరుగుతున్న వాటర్ షెడ్ మహోత్సవ్‌లో పాల్గొననున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అనంతరం CM చంద్రబాబుతో భేటీ
▶ అమరావతిలో దసపల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ
▶ శ్రీకాకుళంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న సిక్కోలు పుస్తక మహోత్సవం, 10 రోజులు కొనసాగింపు
News November 11, 2025
2700 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 2,700 అప్రెంటిస్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం అప్రెంటిస్‌లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. NATS లేదా NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


