News March 14, 2025
వలపు వలలో చిక్కి పాక్కు భారత రహస్యాలు.. వ్యక్తి అరెస్ట్

భారత రక్షణ రహస్యాల్ని పాక్ నిఘా సంస్థ ISIకి చేరవేస్తున్న రవీంద్ర అనే వ్యక్తిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. UPలోని ఫిరోజాబాద్లో ఆర్డినెన్స్ పరిశ్రమలో అతడు పనిచేస్తున్నాడు. నేహా శర్మ పేరుతో ISI విసిరిన వలపు వలలో చిక్కుకుని కీలక సమాచారాన్ని వారికి చేరవేశాడని అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాల్ని అతడి ఫోన్ నుంచి రికవర్ చేశామని, అతడి సహాయకుడినీ అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
314 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు <<18375894>>ఆలౌటైంది<<>>. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన RSA ఆట ముగిసే సమయానికి 26/0 రన్స్ చేసింది. బవుమా సేన 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.
News November 24, 2025
ధర్మేంద్ర ఆస్తి ఎంతో తెలుసా?

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరిగా వెలుగొందిన ధర్మేంద్ర అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన ఆస్తి విలువ రూ.335-450 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది. సినిమాలు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల ద్వారా ఇంత మొత్తం ఆర్జించినట్లు తెలిపింది. ముంబై-పుణె మధ్యలో ఉండే లోనావాలాలో 100 ఎకరాల ఫాంహౌజ్ ఉందని పేర్కొంది. ఆయన సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కువగా ఈ ఫౌంహౌజ్లో చేసే వ్యవసాయం వీడియోలను పోస్ట్ చేయడం గమనార్హం.
News November 24, 2025
గులాబీ తోటల్లో చీడపీడల ముప్పు

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.


