News February 9, 2025
చిలుకూరు అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు <<15408903>>రంగరాజన్‌పై దాడి<<>> చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
Similar News
News December 19, 2025
అధిక మాంసోత్పత్తి కోసం గిరిరాజా కోళ్లు

మాంసం కోసం పెరటి కోళ్లను పెంచాలనుకుంటే గిరిరాజా కోళ్లు చాలా అనువైనవి అంటున్నారు వెటర్నరీ నిపుణులు. ఇవి అత్యధికంగా 3కిలోల నుంచి 5కిలోల వరకు బరువు పెరుగుతాయి. అలాగే ఏటా 140 నుంచి 170 గుడ్ల వరకూ పెడతాయి. దేశీయ కోళ్లకన్నా రెండు రెట్లు అధిక బరువు పెరుగుతాయి. సరైన దాణా అందిస్తే 2 నెలల్లోనే ఏకంగా 3 కేజీలకు పైగా బరువు పెరగడం గిరిరాజా కోళ్లకు ఉన్న మరో ప్రత్యేక లక్షణం.
News December 19, 2025
125 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

కోల్ ఇండియా లిమిటెడ్(<
News December 19, 2025
నేడు 5వ T20.. కోహ్లీని అభిషేక్ దాటేస్తారా?

IND, SA మధ్య నేడు 5వ T20 జరగనుంది. గిల్‌కు గాయం కావడంతో అభిషేక్‌తో సంజూ ఓపెనర్‌గా వచ్చే ఛాన్సుంది. కాగా ఈ మ్యాచులో అభిషేక్‌ను ఓ రికార్డ్ ఊరిస్తోంది. మరో 47 రన్స్ చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన IND బ్యాటర్‌గా నిలుస్తారు. 2016లో కోహ్లీ 1614 రన్స్ చేయగా, ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసే ఛాన్స్ వచ్చింది. అటు బుమ్రా జట్టులో చేరే అవకాశముంది. అహ్మదాబాద్‌లో 7PMకు మ్యాచ్ ప్రారంభం కానుంది.


