News October 25, 2025

మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన వ్యక్తి అరెస్ట్

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో SAతో మ్యాచ్ కోసం ఇండోర్(MP)కు వెళ్లిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న హోటల్ నుంచి కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు ప్లేయర్లను బైక్‌పై వచ్చిన ఆకతాయి అసభ్యంగా తాకి పారిపోయాడు. వారు జట్టు మేనేజ్‌మెంట్‌కు విషయం చెప్పగా సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు అకీల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.

Similar News

News October 25, 2025

అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దు: కోర్టు

image

అనుమతి లేకుండా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. పేరు, ఫొటోల ఏఐ మార్ఫింగ్‌తో తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఇటీవల చిరు కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో 30 మందికి నోటీసులు జారీ చేసింది.

News October 25, 2025

డీసీపీపై దాడికి యత్నం.. కాల్పులు

image

TG: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం రేగింది. విక్టోరియా గ్రౌండ్‌లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై సెల్‌ఫోన్ దొంగ కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో డీసీపీ అతడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగ తీవ్రంగా గాయపడగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 25, 2025

తుఫాను టైమ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

AP: <<18098989>>తుఫాను<<>> సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను APSDMA వివరించింది.
*హెచ్చరికల కోసం SMSలు గమనించండి.
*అత్యవసర సామగ్రిని సిద్ధం చేసుకోండి.
*అధికారులు సూచించగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి.
*విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లలో ఉంచండి.
*విద్యుత్ మెయిన్ స్విచ్, ఎలక్ట్రానిక్స్ ఆపేయండి.
*తలుపులు, కిటికీలు మూసే ఉంచండి.
*పశువులు, పెట్స్‌ను వదిలేయండి.