News February 19, 2025
మేడిగడ్డ ప్రాజెక్టుపై కేసు వేసిన వ్యక్తి హత్య

TG: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన లింగమూర్తి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపై దుండగులు కత్తితో దాడి చేశారు . తీవ్ర గాయాలపాలైన ఆయన ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. మేడిగడ్డలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు వేయగా.. KCR, హరీశ్ రావుకు జిల్లా కోర్టు గతంలో నోటీసులిచ్చింది. ఈ కేసుపై రేపు HCలో విచారణ ఉండగా, నేడు ఆయన హత్యకు గురయ్యారు.
Similar News
News September 15, 2025
వెంటనే రూ.10వేల కోట్లు విడుదల చేయండి: సబిత

TG: విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని BRS నేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు బకాయి పడ్డ రూ.10వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయండి. మేము కరోనా సమయంలో ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా నిధులు ఆపలేదు’ అని ట్వీట్ చేశారు.
News September 15, 2025
షాపుల్లో GST తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మల

GST తగ్గింపుతో 140కోట్ల మందికి ఉపశమనం లభించనుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైలో జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఈనెల 22 నుంచి పన్ను తగ్గింపు అమలులోకి వస్తుంది. GST తగ్గింపు వివరాలతో అన్ని దుకాణాల్లో బోర్డులు పెట్టాలి. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాం. 350కి పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అది సరిగ్గా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి’ అని సూచించారు.
News September 15, 2025
ఫ్లో దెబ్బతింటుందనే పాటలు పెట్టలేదు: మిరాయ్ డైరెక్టర్

మిరాయ్ మూవీలో వైబ్ ఉంది బేబీ సాంగ్తోపాటు నిధి అగర్వాల్తో చేసిన ఓ పాటను కూడా మేకర్స్ పక్కన పెట్టేశారు. దీనిపై డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని స్పందించారు. మూవీ ఫ్లో దెబ్బతింటుందనే ఈ సాంగ్స్ పెట్టలేదని చెప్పారు. నిధి అగర్వాల్ పాట షూట్ చేసింది ఫస్ట్ పార్ట్ కోసం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అది రెండో పార్ట్ కోసమే తీసినట్లు హింట్ ఇచ్చారు. అయితే ‘వైబ్ ఉంది బేబీ’ పాటపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదు.