News September 7, 2024
మన గణపయ్య.. పాన్ వరల్డ్

విఘ్నాలను తొలగించే గణపయ్య వరల్డ్ ఫేమస్. విదేశాల్లోనూ పలు పేర్లతో పూజలందుకుంటున్నాడు. థాయ్‌లాండ్ ప్రజలు లంబోదరుడిని ‘ఫిరా ఫికానెట్’ పేరుతో పిలుస్తారు. టిబెట్‌లో మహారక్త గణపతి రూపాల్లో ఆరాధిస్తారు. ఇండోనేషియాలో మాంత్రిక కర్మలలో అడ్డంకులు తొలగించే దేవునిగా వినాయకుడిని భావించి కొలుస్తారు. చైనాలో ‘హువాంగ్ సీ టియాన్’, జపాన్‌లో ‘కంగిటెన్’ అని పిలుచుకుంటారు. కాంబోడియా, అఫ్గాన్‌లోనూ ఏకదంతుడి ఆలయాలున్నాయి.
Similar News
News September 19, 2025
టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌గానూ పనిచేశారు.
News September 19, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.
News September 19, 2025
23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు: పల్లా

AP: అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని, ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదని చెప్పారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదన్నారు. 2019లో 23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్‌మీట్‌లలో మాట్లాడతామనడం సరికాదని హితవు పలికారు.