News October 9, 2025
SBIలో మేనేజర్ ఉద్యోగాలు

SBI 7 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/FRM/CA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు గరిష్ఠ వయసు 45ఏళ్లుకాగా, మేనేజర్ పోస్టుకు 36ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/
Similar News
News October 9, 2025
ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ‘ఉమెన్ వింగ్’ ఏర్పాటు

పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ‘జమాత్-ఉల్-మోమినాత్’ పేరిట మహిళా వింగ్‌ను ఏర్పాటు చేసింది. జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ దీనికి నాయకత్వం వహించనుంది. ఆమె భర్త, ఉగ్రవాది యూసుఫ్ మేలో IND చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో హతమయ్యాడు. జైషే కమాండర్ల భార్యలతో పాటు బహవల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్, మెన్‌సెహ్రా ప్రాంతాల్లో చదివే మహిళలే టార్గెట్‌గా రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
News October 9, 2025
నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదు: ఏజీ

TG: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ సమయంలో కోర్టుల జోక్యం సరికాదని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టులో వాదించారు. రాజ్యాంగంలోని 243 ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఆయన పాయింట్ లేవనెత్తారు. శాస్త్రీయ సమాచారంతోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రక్రియ చేపట్టలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
News October 9, 2025
2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన సాధ్యమేనా?

బడ్జెట్, ఆర్థిక కారణాలతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏ రాష్ట్రంలోనైనా నెమ్మదిగా ఉంటుంది. వేలల్లో భర్తీకే ఏళ్లు పడతాయి. అలాంటిది తాము ప్రతి ఇంటికి <<17957773>>ఓ ఉద్యోగం<<>> ఇస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బిహార్‌లో 2.9కోట్ల కుటుంబాలున్నాయని, హామీ ఆచరణ సాధ్యమేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల వేళ కొండ మీది కోతినైనా తెస్తామని నేతలు చెబుతారని పలువురు విమర్శిస్తున్నారు.