News March 17, 2024
మంచిర్యాల: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం.. విద్యార్థిని మృతి

మంచిర్యాలలోని లక్ష్మీ నగర్లో ఉన్న తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్న వహిదా అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. సోమవారం తలనొప్పి ఉన్నట్లు ప్రిన్సిపల్కి చెప్పినా పట్టించుకోలేదని, పరిస్థితి విషమించడంలో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం HYDలోని నిమ్స్కి తరలించగా ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
ఆదిలాబాద్: తొలిసారిగా JEE మెయిన్స్ పరీక్షలు

దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో తొలిసారిగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21, 22, 23, 24, 28వ తేదీల్లో రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నిబంధన విధించడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు తనిఖీలు చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు.
News January 20, 2026
ఆదిలాబాద్: లారీ ఢీకొని వ్యక్తి మృతి

ఆదిలాబాద్లోని తిరుపల్లి వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (50) లారీ కిందపడి దుర్మరణం చెందాడు. కాలినడకన రోడ్డు పక్క నుంచి వెళ్తుండగా రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టామన్నారు.
News January 20, 2026
ADB: రేపు డిప్యూటీ సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నెల 21న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉట్నూర్ మండలం దంతన్ పల్లి, కుమ్మరి తండాలలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు.


