News January 27, 2025
ఇండిగోపై మంచు లక్ష్మి ఆగ్రహం

ఇండిగో విమానయాన సంస్థపై నటి, నిర్మాత మంచు లక్ష్మి ట్విటర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవాలో తాను ఎక్కిన ఇండిగో 6E585 విమాన సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా, దురుసుగా వ్యవహరించారని వాపోయారు. ‘నా బ్యాగ్ ఓపెన్ చేయనివ్వలేదు. లగేజీ గోవాలోనే వదిలేస్తామని బెదిరించారు. బ్యాగ్‌కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా పెట్టలేదు. ఇది హింసించడమే. ఇంకెప్పుడూ ఇండిగో ఎక్కేది లేదు’ అని స్పష్టం చేశారు.
Similar News
News October 15, 2025
స్పామ్ కాల్స్ రావొద్దంటే ఇలా చేయండి!

గత కొన్నేళ్లుగా స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. లోన్లు, క్రెడిట్ కార్డులు ఇస్తాం అంటూ పదేపదే కాల్స్ చేస్తూ విసిగిస్తున్నారు. అలాంటి కాల్స్ రాకుండా ఉండేందుకు ఇప్పటికే ట్రాయ్ DND (Do Not Disturb) అనే విధానం తీసుకొచ్చింది. 1909 నంబర్‌కు కాల్ లేదా SMS చేసి టెలిమార్కెటింగ్ కాల్స్ రాకుండా బ్లాక్ చేయవచ్చు. లేదా DND యాప్ నుంచి నేరుగా టెలి కమ్యూనికేషన్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.
Share it
News October 15, 2025
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్టుల స్టేటస్లు మిస్ అవకుండా నోటిఫికేషన్ వచ్చేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ట్రయల్ చేస్తోంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.25.30.4 వెర్షన్లో ఈ ట్రయల్ కొనసాగుతోంది. యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్ట్ స్టేటస్‌పై క్లిక్ చేసి పైన త్రీ డాట్స్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ‘Get notifications’ ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఆ కాంటాక్ట్ స్టేటస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
News October 15, 2025
డేటా సెంటర్‌కు నీరెందుకు అవసరం?

డేటా సెంటర్లలోని వేలాది సర్వర్లు, స్టోరేజీ డివైజులు, నెట్వర్కింగ్ పరికరాలు 24/7 రన్ అవుతాయి. దీంతో అధిక టెంపరేచర్ జనరేట్ అవుతుంది. వాటిని <<18016110>>కూల్<<>> చేయకపోతే హార్డ్‌వేర్ ఫెయిల్ కావడంతో పాటు అగ్నిప్రమాదాలూ జరగొచ్చు. ఒక పెద్ద డేటా సెంటర్ మెగావాట్ల విద్యుత్, రోజుకు లక్ష నుంచి 5 లక్షల గ్యాలన్ల నీటిని వాడుకుంటుంది. చిల్లర్స్, లిక్విడ్ కూలింగ్, నీటి ఆవిరి, కూలింగ్ టవర్లు ఉపయోగించి వాటిని కూల్ చేస్తారు.