News September 21, 2024
ప్రకాశ్ రాజ్‌కు మంచు విష్ణు కౌంటర్!

లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ <<14151603>>సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు <<>>చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రకాశ్ రాజ్ గారూ. తిరుమల లడ్డూ అంటే కేవలం ప్రసాదం కాదు. నాలాంటి కోట్లాదిమంది హిందువులకు ఓ నమ్మకం. దర్యాప్తు జరగాలంటూ పవన్ కళ్యాణ్ కరెక్ట్‌గా మాట్లాడారు. మతకల్లోలాల రంగు ఎవరు ఎక్కడ పులుముతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో’ అని సూచించారు.
Similar News
News November 10, 2025
అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి: మోదీ

ప్రముఖ రచయిత <<18246561>>అందెశ్రీ<<>> మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. ‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన.. ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉంది’ అని పేర్కొన్నారు.
News November 10, 2025
ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

శరీర పెరుగుదలకు ఎముకలు బలంగా ఉండటం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ 15-20 నిమిషాలు సూర్యకాంతిలో ఉంటే ఎముకలు బలంగా ఉంటాయని అంటున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, యోగా చేయాలని సూచిస్తున్నారు. స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని లేకుంటే ఎముకల సాంద్రత తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
News November 10, 2025
భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

<


