News July 12, 2024
ఇన్‌స్టాలో NTRను అధిగమించిన మంచు విష్ణు

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యలో జూ.ఎన్టీఆర్‌ను అధిగమించారు. ఎన్టీఆర్‌కు 7.5మిలియన్ల ఫాలోవర్లుండగా మంచు విష్ణును 8మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 26.5మిలియన్ల ఫాలోవర్లతో అల్లు అర్జున్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. రామ్ చరణ్ 23.9M, విజయ్ దేవరకొండ 21.7M ఫాలోవర్లతో ఉన్నారు. కాగా మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
Similar News
News November 24, 2025
స్మృతి తండ్రికి గుండెపోటు.. కారణమిదే!

తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి చివరి నిమిషంలో <<18368671>>ఆగిపోయిన<<>> విషయం తెలిసిందే. పెళ్లి పనుల ఒత్తిడితోనే గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తుండగా ‘యాంజియోగ్రామ్’ చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీనివాస్ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో స్మృతి పెళ్లి ఎప్పుడనేదానిపై కుటుంబీకులు తర్వాత డిసైడ్ చేయనున్నారు.
News November 24, 2025
కాలిన వత్తితో ఇలా చేస్తే.. ఇంటికి ఎంతో మంచిది

దీపారాధనలో కాలిపోయిన వత్తిని చాలామంది పడేస్తుంటారు. కానీ, దానిలో ఎంతో సానుకూల శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘కాలిన 10 వత్తులలో కర్పూరం వెలిగించి, అందులో 4 లవంగాలు వేసి దూపంలా తయారుచేసుకోవాలి. ఆ పొగను ఇల్లు అంతటా వ్యాపించేలా చేస్తే.. ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ బయటకి వెళ్లిపోతాయి. ఆ బూడిదను దిష్టి తీయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది’ అని అంటున్నారు.
News November 24, 2025
ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం

ఆశ్లేష నక్షత్రం సాధారణంగా జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తుంది. ఆ సమయంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే, పంట పొలాలకు నీరు అందుతుంది, భూమి సారవంతమవుతుంది అలాగే ఆ సంవత్సరంలో మంచి దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. దీని వల్ల ప్రజలందరికీ ఆహార భద్రత ఏర్పడి, సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉంటారని ఈ సామెత సూచిస్తుంది.


