News March 15, 2025

RRR, పుష్ప ఫలితాలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

image

కథ బాగా చెప్తే ఏ భాషలో అయినా, ఏ రాష్ట్రం‌లో అయినా, ఏ దేశంలో అయినా సినిమా ఆడుతుందని హీరో మంచు విష్ణు నమ్మకం వ్యక్తం చేశారు. బాహుబలి, RRRలే సినిమాలే అందుకు ఉదాహరణ అని చెప్పారు. RRR సినిమాలోని అల్లూరి, కొమురంభీం గురించి తెలుగు వారికి తప్ప ఎవరికీ తెలియదని కథ చెప్పే విధానం వల్లే సూపర్ హిట్‌గా నిలిచాయన్నారు. అదే కారణంతో పుష్ప సినిమా కూడా తెలుగులో కంటే హిందీలో పెద్ద హిట్ అయిందని అని చెప్పారు.

Similar News

News December 11, 2025

రోజ్మేరీ ఆయిల్‌తో ఎన్నో లాభాలు

image

రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. క్రమంగా జుట్టు రాలడాన్ని నివారించి.. హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలతో పోరాడతాయి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించి.. స్కాల్ప్​ ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి

News December 11, 2025

550 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కపుర్తాలాలోని <>రైల్<<>> కోచ్ ఫ్యాక్టరీ 550 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. SC, ST, PWD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://rcf.indianrailways.gov.in

News December 11, 2025

రేగు పండ్లు తింటే ఎన్ని లాభాలో..

image

చలికాలంలో లభించే రేగు పండ్లను తరచూ తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపడతాయని వెల్లడిస్తున్నారు. కడుపులో మంట, మలబద్దకం సమస్యలు, చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయంటున్నారు. కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ పండ్లు క్యాన్సర్ కారకాలనూ నిరోధిస్తాయంటున్నారు. మీకు రేగు పండ్లు ఇష్టమా? కామెంట్ చేయండి.