News December 25, 2024

‘మా’ సభ్యులకు మంచు విష్ణు కీలక సూచన

image

సినీ పరిశ్రమ తరలింపు ప్రచారం నేపథ్యంలో ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందని, HYDలో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడటానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సున్నిత విషయాలపై ‘మా’ సభ్యులు స్పందించవద్దని కోరారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం: మావోయిస్ట్ పార్టీ

image

డిసెంబర్ 2 నుంచి 8 వరకు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (PLGA) 25వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని CPI(మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ పిలుపునిచ్చింది. కగార్ యుద్ధం నుంచి పార్టీని, PLGAని, ప్రజా సంఘాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దామని పేర్కొంది. 11 నెలల్లో 320 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని తెలిపింది.

News November 22, 2025

పాపాల నుంచి విముక్తి కోసం..

image

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాప భయాపహమ్ ||సమస్త లోకాలకు ఆధారభూతుడైన, ఏకైక ప్రభువైన విష్ణుమూర్తి వేయి నామాలను తప్పక ఆలకించాలని భీష్మాచార్యుల వారు ఉద్బోధించారు. ఈ పవిత్ర నామాలను శ్రద్ధతో వినడం వలన పాప కర్మలు, జన్మ,మృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. శాశ్వత శాంతిని, సకల శుభాలను పొందడానికి విష్ణు సహస్ర నామ పారాయణ సులభమైన మార్గమంటారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 22, 2025

GREAT: బ్యాగులో రూ.10,00,000.. అయినా పైసా ముట్టలేదు!

image

పుణే(MH)కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే గొప్ప మనసు చాటుకున్నారు. గురువారం చెత్త ఏరుతుండగా ఆమెకు ఓ బ్యాగ్ దొరికింది. అందులో డబ్బు, మెడిసిన్లు కనిపించాయి. అది ఎవరిదో కనుక్కునేందుకు ఆ వీధి అంతా తిరిగింది. ఓ వ్యక్తి టెన్షన్‌తో కనిపించడంతో అతడికి వాటర్ ఇచ్చింది. బ్యాగ్ దొరికిందని ఇచ్చేసింది. అందులో రూ.10 లక్షల క్యాష్ ఉంది. దీంతో ఆమె నిజాయతీకి మెచ్చిన బ్యాగ్ యజమాని చీర, కొంత డబ్బు ఇచ్చాడు.