News August 24, 2024
సీఎం చంద్రబాబుతో మందకృష్ణ భేటీ

AP: సీఎం చంద్రబాబుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయనను కలిసి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేసినందుకు మందకృష్ణను చంద్రబాబు సత్కరించారు. కాగా ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌తోనూ ఆయన సమావేశమైన విషయం తెలిసిందే.
Similar News
News December 5, 2025
HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.
News December 5, 2025
Breaking: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

RBI గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 నుంచి 5.25 శాతానికి చేరింది. ఈ క్రమంలో లోన్లు తీసుకునే వారికి ఊరట దక్కనుంది. ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. కాగా ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో 50 పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది.
News December 5, 2025
విమానాల రద్దు.. ఈ విషయాలు తెలుసుకోండి!

3 రోజులుగా ఇండిగో విమాన <<18473431>>సర్వీసులు<<>> రద్దవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయాల్లో ఎయిర్‌లైన్స్ పాటించాల్సిన బాధ్యతలపై DGCA రూల్స్ జారీ చేసింది. ఆ ప్రకారం.. సర్వీసు రద్దయితే ముందే సమాచారం ఇవ్వాలి. ప్రత్యామ్నాయ విమానంలో ఫ్రీగా వెళ్లే ఏర్పాటు చేయాలి. ప్రయాణికులు కోరుకుంటే రీఫండ్ చేయాలి. 2గంటలకు మించి ఆలస్యమైతే భోజనం, ఫ్రెష్ అయ్యే సౌకర్యం కల్పించాలి. 24 గంటలు దాటితే ఫ్రీగా హోటల్, రవాణా ఏర్పాటు చేయాలి.


