News April 1, 2024

జనసేనలోకి మండలి బుద్ధప్రసాద్?

image

AP: అవనిగడ్డ TDP ఇన్‌ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ పవన్‌ను కలిసి, పార్టీ మారే ఛాన్సుంది. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా కూటమి తరఫున ఆయన బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయనకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించారు.

Similar News

News January 26, 2026

బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డు

image

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చరిత్రలో తొలిసారి ఔన్స్ (28.35గ్రా) బంగారం $5,000కి (₹4.59L) చేరింది. ఒక ఔన్స్ సిల్వర్ $100గా ఉంది. 2025లో గోల్డ్ రేట్ 60%, వెండి 150% పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. US-NATO, ఇరాన్, గ్రీన్లాండ్ టెన్షన్స్, ట్రంప్ టారిఫ్స్ వంటివి దీనికి కారణాలుగా చెబుతున్నాయి. 2026 చివరికి బంగారం ఔన్స్ $5,400కి చేరొచ్చని అంచనా. ఈ పెరుగుదల భారత్ సహా ఇతర మార్కెట్లపైనా ప్రభావం చూపనుంది.

News January 26, 2026

తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

image

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News January 26, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

<>కొచ్చిన్<<>> పోర్ట్ అథారిటీ 7 మెరైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/మ్యాథ్స్), బీటెక్(మెరైన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35-40ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.cochinport.gov.in