News September 12, 2024

మంగళగిరి నివాసమే క్యాంపు ఆఫీస్.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

image

AP: విజయవాడలో తన క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంపై విమర్శలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మంగళగిరిలోని తన నివాసాన్నే క్యాంపు ఆఫీసుగా వాడుకోనున్నారు. పాత ఆఫీసును, అందులోని ఫర్నిచర్‌ను వెనక్కు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో విశాలమైన భవనాన్ని కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News February 4, 2026

నేను BRS ఎమ్మెల్యేనే.. కాంగ్రెస్‌తో పనిచేస్తున్నా: సంజయ్

image

TG: తాను BRS టికెట్‌పై గెలిచానని, ఆ పార్టీలోనే ఉన్నానని జగిత్యాల MLA సంజయ్ వెల్లడించారు. ప్రతినెలా తన జీతం నుంచి బీఆర్ఎస్‌కు రూ.5వేలు వెళ్తున్నాయన్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని చెప్పారు. కాగా ఫిరాయింపుల కేసులో సంజయ్‌కు స్పీకర్ <<19046638>>క్లీన్‌చిట్<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.

News February 4, 2026

ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్ కొట్టివేత

image

TG: ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్‌ల అనర్హత పిటిషన్లనూ కొట్టేసిన విషయం తెలిసిందే.

News February 4, 2026

ట్రేడ్ డీల్ ఓకే.. క్వాడ్ ప్రాధాన్యం పెరుగుతుందా?

image

US-భారత్ ట్రేడ్ డీల్‌తో ఇరు దేశాల మధ్య రాజకీయ చిక్కుముడులు కూడా వీడనున్నట్టు కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో జరిగిన భేటీలో US సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో క్వాడ్‌‌ ప్రస్తావన తేవడమే కారణం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, చైనాను కట్టడిచేసేందుకు US, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో ఈ క్వాడ్ ఏర్పాటైంది. టారిఫ్స్‌ హడావుడితో ట్రంప్ 2.0లో దీని ప్రాధాన్యం తగ్గగా ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.