News March 18, 2024

మంగళగిరిలో పేదరికం లేకుండా చేస్తా: లోకేశ్

image

AP: తనను గెలిపిస్తే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లోకేశ్ అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చాక మంగళగిరికి పరిశ్రమలు రప్పించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. పేదరికం లేకుండా చేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని కంఠంరాజు కొండూరులో రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

పంటను బట్టి యూరియా వాడితే మంచిది

image

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.

News December 4, 2025

త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాహుల్ గాంధీ!

image

AP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తారని AICC అధికార ప్రతినిధి సునీల్ అహీరా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినూర్ వజ్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇచ్చిన ప్లాంటును బీజేపీ అదానీకి అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

News December 4, 2025

32వేల మంది టీచర్లకు ఊరట

image

పశ్చిమ బెంగాల్‌లో 32వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆ నియామకాలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. 2014లో టెట్ ద్వారా టీచర్లుగా నియమితులైన అందరూ అక్రమంగా ఉద్యోగాల్లో చేరినట్లు దర్యాప్తులో తేలలేదని కోర్టు పేర్కొంది. 264 మంది మాత్రమే అలా చేరారని, వీరి కోసం 32వేల మంది రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.