News December 31, 2024
హైదరాబాద్ మార్కెట్లోకి మామిడి పండ్ల ఎంట్రీ

హైదరాబాద్ మార్కెట్లో సీజన్ కంటే ముందే మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. అయితే ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. వెరైటీని బట్టి కిలో రూ.150 నుంచి రూ.400 పలుకుతోంది. సహజంగా జనవరి చివరి వారం నుంచి జులై వరకు సిటీకి మామిడి సప్లై జరుగుతుంది. తాజాగా కేరళ నుంచి సీజన్‌కు ముందే ప్రతి రోజూ 10-80 క్వింటాళ్ల మామిడి దిగుమతులు ప్రారంభమయ్యాయి. తక్కువ మొత్తంలో సరఫరా డిమాండ్‌కు కారణమైంది.
Similar News
News December 10, 2025
గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల వైరస్ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.


